NTR-Trivikram: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఓ మెగా ప్రాజెక్ట్, అలాగే ‘వార్ 2’తో బిజీగా ఉన్న తారక్.. ఇప్పుడు మరో భారీ చిత్రంతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడట. టాక్ ఏంటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసిన ఓ గ్రాండ్ బడ్జెట్ సినిమా.. ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్లినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు.
Also Read: Harihara Veeramallu: హరిహర వీరమల్లు.. విజువల్ వండర్ అంటున్న మేకర్స్!
NTR-Trivikram: అల్లు అర్జున్ ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్‌లో ఉండటంతో, త్రివిక్రమ్‌తో సినిమా కాస్త ఆలస్యం కావొచ్చని టాక్. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్‌తో ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో అంటేనే అభిమానుల్లో క్రేజ్ వేరే లెవల్. ఈ భారీ చిత్రం గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. మరి, ఈ జోడీ సెట్ అవుతుందా? అంటే.. అందుకు కాలమే సమాధానం చెప్పాలి!