Harihara Veeramallu

Harihara Veeramallu: హరిహర వీరమల్లు.. విజువల్ వండర్ అంటున్న మేకర్స్!

Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి హిస్టారికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ పీరియాడిక్ డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు పవన్ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్‌లోని సంక్లిష్టమైన విజువల్స్ కారణంగా షూటింగ్‌లో ఆలస్యం జరిగినప్పటికీ, తాజా అప్‌డేట్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది.

Also Read: Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత..

Harihara Veeramallu: చిత్ర నిర్మాతలు ఇటీవల ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. గత రెండేళ్లుగా ‘హరిహర వీరమల్లు’ కోసం అల్ జహ్రా స్టూడియోస్ శ్రమించి, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విజువల్స్ ప్రేక్షకులకు ఇప్పటివరకూ చూడని అనుభూతిని అందిస్తాయని, సినిమా ఓ విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. ఈ అప్‌డేట్‌తో రిలీజ్ డేట్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది. పవన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad Metro Fare: ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌.. మెట్రో రైల్ చార్జీల చార్ట్‌ వచ్చేసింది! కొత్త టికెట్‌ ధరలు ఇవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *