Crime News: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.. అని అన్నది సామెత. అయితే ఇక్కడ ఈ ఇంటిదొంగపై తొలుత పోలీసులకూ అనుమానం రాలేదు. కానీ, అతని చర్యలతో పోలీసులకే నేరుగా చిక్కాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. తన ఇంటిలో దొంగతనం చేసి వెళ్తుండగా, ఆ యువకుడు పోలీసులకు చిక్కిపోయాడు.
Crime News: ఖిలా వరంగల్ పడమర కోటలో ఆర్ఎంపీ డాక్టర్ గుర్రపు రామకృష్ణ కుటుంబం నివాసం ఉంటున్నది. రామకృష్ణ కొడుకు జయంత్ నగరంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ఓ అమ్మాయిని జయంత్ ప్రేమిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఇద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు.
Crime News: గతంలో ఇక్కడ చదువుకుంటూనే హైదరాబాద్‌లో ఓ ఫుడ్ కోర్టు పెట్టారు. అక్కడ ఖర్చుల కోసం స్నేహితుల వద్ద జయంత్ అప్పులు చేశాడు. ఆ తర్వాత అది సరిగా నడవక దివాలా తీశాడు. దీంతో చేసిన అప్పులను తీర్చేందుకు, ప్రేయసితో జల్సాలు చేసేందుకు ఓ ప్లాన్ వేశాడు. తన ఇంటిలోనే దొంగతనం చేయాలని ప్రణాళిక రచించాడు.
Crime News: ఆర్ఎంపీ గుర్రపు రామకృష్ణ కుటుంబ సభ్యులు జూన్ నెల 8న తాళం వేసి హైదరాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి బీరువాలోని 16 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Crime News: తాజాగా మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, వారిని చూసిన ఓ వాహనదారుడు పారిపోతుండగా, పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ పారిపోతున్న యువకుడు ఆర్ఎంపీ గుర్రపు రామకృష్ణ కొడుకు జయంత్‌గా గుర్తించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా, అసలు విషయం బయటపడింది. తన ఇంటిలో బంగారు ఆభరణాలను దొంగిలిచింది తానేనని ఒప్పుకున్నాడు.
Crime News: దొంగిలించిన బంగారంలో కొంత కరిగిద్దామని వెళ్తుండగా, పోలీసులకే చిక్కిపోయాడు. ఒకవేళ అలా పరారు కాకుండా ఉంటే పోలీసులకు అనుమానం రాకుండా ఉండేది. దీంతో కొంతకాలం వరకు అసలు దొంగ ఎవరో తేలకపోయేది. అంటే ఇంటి దొంగ తనంత తానుగా పోలీసులకు దొరికిపోయాడనుకోండి. అసలు విషయం ఏమిటంటే ఎప్పటికైనా చేసిన దొంగతనం బయటపడకుండా ఉండదనేది నిజం.