Trisha: త్రిష ఓకే అంటే ఆ సినిమాకు మరింత క్రేజ్

త్రిషకృష్ణన్ అంటే ఈ పేరు తెలియని వారు ఉండరు. పాతికేళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ అభిమానుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించు కుంది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 22 సంవత్సరాలు దాటింది. 41 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ పరిశ్రమలోకి వచ్చే కొత్త హీరోయిన్లకు, ఇప్పటికే ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే తన కెరీర్ లో సూపర్ ఫాంలో ఉందని చెప్పొచ్చు.

1999లో తమిళ్ మూవీ ‘జోడీ’తో తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ప్రభాస్తో జోడీగా ‘వరం’ మూవీలో కనిపించే ఫేమస్ అయిపోయింది. ఇప్పిటకీ త్రిష అంటే వర్షం మూవీ గుర్తుండేలా తన నటనతో ఆకట్టుకుంది.

తాజాగా ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ మూవీలో లేడీ లీడ్ రోల్ చేస్తోంది. అయితే ఈ మూవీలో త్రిషకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందట. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. కానీ హిందీలో సూపర్ హిట్టు కొట్టిన ‘కిల్’ మూవీని తెలుగు, తమిళ్ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

రమేష్ వర్మ డైరెక్షన్లో రాఘవ లారెన్స్ హీరోగా మూవీ తెర కెక్కబోతోంది. ఈ మూవీలో లారెన్స్ జోడీగా త్రిషను ఎంచుకున్నట్టు టాక్. ఈ మేరకు ఆమెతో మూవీ టీమ్ చర్చలు జరుపుతోందట. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ప్రా జెక్టుకు మరింత క్రేజ్ రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *