Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష న్యూయార్క్ టైమ్స్ క్రాస్ వర్డ్ పజిల్ కాలమ్ లో క్లూ లో కనిపించింది. ఈ పజిల్ లో దక్షిణ భారత సినిమా నటి కృష్ణన్ అనే క్లూ ఇచ్చి పూర్తి చేయమన్నారు. ఆన్సర్ గా పలువురు త్రిష అనే పేరు నింపేశారు. ఇది త్రిషతో పాటు ఆమె ఫ్యాన్స్ కు కూడా ఆనందాన్ని కలిగించే విషయం. వరల్డ్ ఫేమస్ దిన పత్రికలో అలా దర్శనం ఇవ్వడం పై త్రిష కూడా పొంగిపోయింది. దీనిని తన సోషల్ మీడియా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన తన పేరును హైలైట్ చేసి క్రాస్ వర్డ్ పజిల్ క్లూని కూడా షేర్ చేసింది. సమంత కూడా పజిల్ లో త్రిష పేరు చూసి ఆనందాన్ని వ్యక్తం చేసింది. దాదాపు 25 ఏళ్ళ కెరీర్ తర్వాత కూడా బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది త్రిష. ఇటీవల వచ్చిన విజయ్ ‘గోట్’ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం త్రిష కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ లో శింబుకు జోడీగా, ‘విడాముయర్చి’,’గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ కి జోడీగా, ‘విశ్వంభర’లో చిరంజీవికి జతగా, మలయాళంలో మోహన్ లాల్ తో ‘రామ్’ చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏ యే సినిమాల్లో త్రిష ప్రేక్షకుల మది గెలుచుకుంటుందో! లెట్స్ వెయిట్ అండ్ సీ.

