Mumbai: గ్యాంగ్ స్టర్ ల వరస బెదిరింపులతో దేశంలో పెద్ద టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ప్రముఖలను చంపేస్తామన్న బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. సల్మాన్ ఖాన్ వంటి సినీ తారాలను చంపేస్తామని బెదిరిస్తున్నారు. తాజాగా శనివారం సాయంత్రం ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ సెల్ కు పేరు తెలియని నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని అందులో ఉన్నట్టు తెలుస్తుంది. యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయకపోతే .. ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని చంపినట్లే చంపేస్తామని ఆగంతకులు ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. ఆ మెసేజ్ ఎవరు పంపారు ఎక్కడి నుంచి వచ్చింది బాబా సిద్ధిఖీని చంపినవారే ఈ మెసేజ్ వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఆ మెసేజ్ ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది ? బాబా సిద్ధిఖీని చంపినవారే ఈ మెసేజ్ పంపారా ? అనే కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. బాబా సిద్ధిఖీ అక్టోబర్ 12న తన కొడుకు జీషాన్ సిద్ధిఖీ ఆఫీస్ వద్ద ఉండగా.. ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు వచ్చిన మర్నాడే ఈ హత్య జరగడం కలకలం రేపింది. సల్మాన్ ఖాన్ ను బెదిరించింది నోయిడాకు చెందిన ఓ కూరగాయల వ్యాపారి అని తెలియడంతో.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.