Transgender In Court: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని వజీర్‌గంజ్ సివిల్ కోర్టులో ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోర్టు ప్రాంగణంలోనే పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ముందు ఆమె అనుచితంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
వీడియోలో ఆ మహిళ కోపంతో అరుస్తూ, చప్పట్లు కొడుతూ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఒక పోలీసు అధికారిని తోసివేయడానికి ప్రయత్నించడంతో పాటు, కోర్టులో బట్టలు విప్పే ప్రయత్నం కూడా చేసింది. ఈ సమయంలో జడ్జి చైర్ ఖాళీగా ఉన్నా, అక్కడ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉండటం వీడియోలో చూడొచ్చు.
ఈ ఘటనపై వజీర్‌గంజ్ పోలీసు అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటన తాజాదికాదని, ఇది రెండు నెలల క్రితమే జరిగిన సంఘటన అని తెలిపారు. అప్పట్లో ఆమెకు నోటీసులు జారీ చేసి హెచ్చరించామని చెప్పారు. విచారణ కోసం ఆమె కోర్టుకు వచ్చిన సమయంలో ఈ హంగామా చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పలు కోణాల్లో చర్చకు దారితీస్తోంది. నెటిజన్లు “ట్రాన్స్‌జెండర్ కావడం వేరే విషయం.. కానీ కోర్టులో పోలీసులపై ఇలా ప్రవర్తించడం పూర్తిగా తప్పు” అని మండిపడుతున్నారు. “ఇటీవల ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు హద్దులు దాటుతున్నాయ”ంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
కోర్టు వంటి శాంతమైన ప్రదేశంలో ఇలా వ్యవహరించడం కచ్చితంగా తప్పు. న్యాయ వ్యవస్థను గౌరవించాలనే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి విచారణ జరగాల్సి ఉంది.
…जब लखनऊ सिविल कोर्ट में किन्नर ने मचाया हंगामा। पुलिस भी खुद को बचाती नजर आई। pic.twitter.com/QZr8CALUHw
— Deshi Virus (@deshivirus) August 1, 2025