Adilabad

Adilabad: భార్యపై దాడి..తర్వాత భర్త ఆత్మహత్య..

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై ఆమె భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఇచ్చోడ సీఐ భీమేష్‌ వివరాలు వెల్లడించారు.

గుడిహత్నూర్ కు చెందిన లట్పటే మారుతి, ముంబే సూర్యకాంత్ కుమారై కీర్తితో 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. విహహానంతరం కొన్నాళ్లు వారి సంసారం సజావుగా సాగింది. అయితే, మారుతి డైరీ ఫారమ్‌ నడుపుతూ 8 లక్షల మేర అప్పులు చేయడంతో పాటు, స్థానికంగా ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి అతన్ని ప్రశ్నించడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.

Also Read: Vizianagaram: తల్లిదండ్రులను చంపిన కసాయి కొడుకు..

వివాదం పెరిగి కీర్తి పుట్టింటికి వెళ్లిపోవగా, కొద్ది రోజుల క్రితం ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఆ సమయంలో తన పరువు తీసిందనే ఆగ్రహంతో మారుతి, కీర్తిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కీర్తి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో కీర్తి ఇంటి పక్కన ఉన్న బోర్‌వేల్ వద్ద నీళ్లు తీసుకుంటుండగా మారుతి ఆమెపై వెనుక నుండి కత్తితో మెడపై దాడి చేశాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె మృతి చెందింది.

అయితే, మండల కేంద్రంలోని చెరువులో జై భీమ్ నగర్ సమీపంలో అనుమానస్పద రీతిలో భర్త శవమై కనిపించాడు. శవం కనిపించడంతో మహిళలు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు మారుతి తన భార్యను చంపిన రోజే తనను తానుగా కత్తితో తన గొంతు కోసం ఆత్మహత్య పాల్పడ్డడా..లేదా.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *