Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ మైనర్ బాలికపై నలుగురు మైనర్లయిన బాలురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. జిల్లాలోని దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో 8వ తరగతి చదువుతున్న 13 ఏండ్ల బాలికపై నలుగురు మైనర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.