LPG Gas: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 అదనంగా పెంచుతున్నట్టు ప్రభుత్వ చమురు కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. ఈ పెరిగిన ధరలతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.2,028 అవుతుంది. అదే ఢిల్లీ నగరంలో రూ.1,802కు చేరనున్నది. ఈ భారం వివిధ వర్గాలపై పడనున్నది. ధరలు పెరగనున్నాయి.
