Renigunta

Renigunta: ఇది ఎక్కడి వింత.. తనను చూసి నవ్వాడని బాలుడిని నరికి చంపేశాడు

Renigunta: తిరుపతి జిల్లా భార్య విడిచి వెళ్లిన మానసిక ఆవేదన, అనుమానంతో రగిలిపోయిన ఒక వ్యక్తి చేసిన దారుణం రేణిగుంటలో విషాదం నింపింది. తనను చూసి అందరూ హేళన చేస్తున్నారనే అనుమానంతో గువ్వల కాలనీకి చెందిన ఆ వ్యక్తి, తనను చూసి నవ్వాడని భావించి 17 ఏళ్ల బాలుడిని అతి కిరాతకంగా పదునైన కత్తితో నరికి హత్య చేశాడు.

రేణిగుంట సంత సమీపంలోని గువ్వల కాలనీలో పూసలు విక్రయించుకునే మేస్త్రీ భార్య ఇటీవల అతడిని విడిచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ వ్యక్తి, చుట్టూ ఉన్నవారంతా తనను చూసి నవ్వుతున్నారని, అవమానిస్తున్నారని అనుమానించడం మొదలుపెట్టాడు.

బుధవారం రోజున అదే ప్రాంతానికి చెందిన శ్రీహరి (17) అనే బాలుడు తనను హేళనగా చూసి నవ్వాడని ఆ మేస్త్రీ భావించి, అతడిని కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి తండ్రి గురువారం ఉదయం నిందితుడి వద్దకు వెళ్లి తన కుమారుడిని ఎందుకు కొట్టావని నిలదీసి, హెచ్చరించి వచ్చాడు.

Also Read: Hyderabad: గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ

అయితే, తండ్రి వెళ్లిపోయిన కొద్దిసేపటికే శ్రీహరికి, ఆ మేస్త్రీకి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఈసారి తీవ్ర ఆగ్రహానికి లోనైన మేస్త్రీ, పూసల దారాలు కోసేందుకు ఉపయోగించే పదునైన కత్తిని తీసుకుని బాలుడి మెడపై నరికాడు. శ్రీహరి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ, గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

ఈ దారుణ ఘటనతో గువ్వల కాలనీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శ్రీహరి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కేసు నమోదు చేసుకున్న రేణిగుంట పోలీసులు, నిందితుడైన మేస్త్రీని అదుపులోకి తీసుకున్నారు. భార్య విడిచి వెళ్లిన మానసిక ఒత్తిడి, అనుమానమే ఈ దారుణానికి కారణమా లేదా ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆగ్రహం మనుషులను ఎంతటి దారుణాలకు ఉసిగొల్పుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *