Dragon Glimpse: జూనియర్ ఎన్టీఆర్ ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ టైటిల్‌పై ఎట్టకేలకు అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. సినీ వర్గాల్లో ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ చిత్రానికి ‘డ్రాగన్’ (Dragon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇస్తూ, ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు సుమారు నాలుగు నిమిషాల నిడివిగల ఒక పూర్తిస్థాయి ట్రైలర్ లాంటి గ్లింప్స్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.
ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్.. కంటెంట్‌పై ఫుల్ క్లారిటీ!
తాజాగా విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డార్క్ యాక్షన్ జానర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రశాంత్ నీల్, ఈ సినిమాలోనూ తన సిగ్నేచర్ మార్క్ ఎలివేషన్స్ ఏమాత్రం తగ్గకుండా గ్లింప్స్ కట్ చేశారు. ఈ 4 నిమిషాల వీడియో మొత్తం సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటి, కంటెంట్ ఎలా ఉండబోతోంది అనే విషయంపై ప్రేక్షకులకు పక్కా క్లారిటీ ఇచ్చేసింది. ఎన్టీఆర్ రౌద్ర రూపం, నీల్ యాక్షన్ టేకింగ్ చూస్తుంటే ఈ సినిమాతో థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది.
రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
ఈ హై-వోల్టేజ్ గ్లింప్స్ చూసిన తర్వాత ఎన్టీఆర్ – నీల్ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది (2026)లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న సమయానికి జరగకపోవడం, పలు సాంకేతిక కారణాల వల్ల షూట్లు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే, ఈ సినిమాను వచ్చే ఏడాది (2027) లో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు గ్లింప్స్ వేదికగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రేజీ కాంబో టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తాజాగా ‘డ్రాగన్’ మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఆ నెక్స్ట్ లెవెల్ వీడియోపై మీరు కూడా ఒక కన్నేసేయండి!
