Karnataka: 2010లో కర్ణాటక వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన తుమకూరు జిల్లా గోపాల్‌పూర్ గ్రామంలో దళిత మహిళను హత్య చేసిన కేసులో 21 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 28 జూన్ 2010న తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా గోపాల్‌పూర్ గ్రామంలో దాబా హోనమ్మ అనే దళిత మహిళను రాళ్లతో కొట్టి చంపారు. దీనికి సంబంధించి హందనకెరె పోలీస్ స్టేషన్‌లో మొత్తం 27 మందిపై హత్య, కుల హింస కేసు నమోదైంది.ఈ కేసులో 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు జిల్లా సెషన్స్ కోర్టు అదే గ్రామానికి చెందిన 21 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కో నిందితుడికి రూ.13,500 జరిమానా విధించారు.
ఇది కూడా చదవండి: Haryana: స్కూల్ బస్సుపై కాల్పులు.. డ్రైవర్ సహా నలుగురు విద్యార్థులకు గాయాలు
Karnataka: ఈ కేసును విచారించిన అప్పటి డీఎస్పీ శివరుద్రస్వామి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా, విచారణలో మొత్తం 27 మంది నిందితులపై అభియోగాలు రుజువయ్యాయి. ఇప్పుడు తుమకూరులోని మూడో హైస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నాగిరెడ్డి నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రస్తుతం 27 మంది నిందితుల్లో ఆరుగురు ఇప్పటికే చనిపోయారు. దీంతో 21 మంది నిందితులకు శిక్ష పడింది. శిక్షపడిన 21 మందిలో ఇద్దరు మహిళలు, 19 మంది పురుషులు ఉన్నారు.