ఇది సమరం కాదు..దేవర సంబరం…

Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధం చేశారు గ్రామస్తులు. ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం అని అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు దేవరగట్టు ప్రజలు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం చేస్తారు.

3 గ్రామాలు ఒక జట్టుగా, 5 గ్రామాలు మరో జట్టుగా ఏర్పడి కొట్లడుతారు. బన్నీ ఉత్సవంలో ఏటా అనేక మందికి తీవ్ర గాయాలు అవుతాయి. ఇది చట్టప్రకారం లేదు అని ఎవరైనా అడిగితే..స్థానికులు ఇదిసమరం కాదు సంబరం, సంప్రదాయమంటారు.

ఈ క్రమంలోనే అధికారులు హింసకు తావులేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాల సీసీ కెమెరాలు, డ్రోన్లతో అధికారుల నిఘా పెట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *