Medchal

Medchal: రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్‌ అధికారి

Medchal: డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ టౌన్‌ప్లానింగ్‌ అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మేడ్చల్‌ జిల్లాలోని ఎల్లంపేట్‌ మున్సిపల్ ఆఫీసులో ఈ ఘటన జరిగింది.

రూ.5 లక్షలు అడిగి.. రూ.3.50 లక్షలు తీసుకుంటుండగా..!
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. మున్సిపల్ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న రాధాకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక వెంచర్‌కు అనుమతి ఇచ్చేందుకుకంగా ఏకంగా రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడు.

బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చు పన్నారు. ఈ క్రమంలో, రాధాకృష్ణారెడ్డి శనివారం రూ.3.50 లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అడ్వాన్స్‌గా లక్ష తీసుకున్న అధికారి
అంతేకాకుండా, ఈ లంచంలో భాగంగా అధికారి రాధాకృష్ణారెడ్డి ఇప్పటికే రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన అధికారి ఇలా లంచాలు అడగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం, రాధాకృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇంకా ఎంత అక్రమాస్తులు బయటపడతాయో చూడాలి. అవినీతికి పాల్పడితే తప్పకుండా శిక్ష తప్పదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *