Lokesh as Dy CM: కొన్నిరోజులుగా ఏపీలో కూటమి పార్టీలు ముఖ్యంగా టీడీపీ, జనసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనీ డిమాండ్ వినిపిస్తూ వస్తోంది. దీనికి కౌంటర్ గా జనసేన పార్టీ వైపు నుంచి పవన్ కళ్యాణ్ ను సీఎం ను చేయాలని డిమాండ్ వెలువడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం స్పందించింది.
మీ వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీమీద రుద్ద వద్దంటూ తన పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. కూటమిలో ఎప్పుడు ఏమి చేయాలి అనేది కూటమి సమన్వయ కర్తలు చూసుకుంటారని.. పదవుల విషయంలో పార్టీ నాయకులు మాట్లాడవద్దని చెప్పింది. పార్టీ నాయకులు మీడియా ముందు వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.
Lokesh as Dy CM: ఏ అంశం గురించి అయినా కూటమి పెద్దలు మాట్లాడతారని.. మీడియా ముందు రాద్ధాంతాలు మానాలని అధిష్టానం పార్టీ శ్రేణులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మీడియా ముందు అనవసర విషయాలను చర్చకు పెట్టడంపై సీరియస్ గానే టీడీపీ అధిష్టానం రియాక్ట్ అయినట్టు చెబుతున్నారు.
మొత్తంమీద లోకేష్ ను డిప్యూటీ చేయాలనే టీడీపీ పార్టీ శ్రేణులు, నాయకుల డిమాండ్ పై అధిష్టానం నీళ్లు చెల్లినట్టే కనిపిస్తోంది. చూడాలి తరువాత ఏమి జరుగుతుందో.