Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనదైన ముద్రవేసుకున్నారు.
పార్టీ ఆవిర్బావం నుంచి ప్రతీ ఆలోచన దూరదృష్టితో చేస్తూ వచ్చారు. పవన్ నిర్ణయాలు చాలా మందికి అర్ధంకాక తలలు పట్టుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. కాలక్రమంలో చోటుచేసుకున్న పరిస్ధితుల చూసిన తర్వాత జనసేనాని ఆలోచనకు సలామ్ కొట్టేవారు. అలా పార్టీ స్ధాపించిన నాటి నుంచి రాజకీయాల్లో అనేక మాటలు పడుతూ… అష్టకష్టాలు పడుతూ పార్టీని నడిపారు. 2024 ఎన్నికల ముందు కూడా జనసేనని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, బీజెపీ, టీడీపీని ఒక తాటిమీదకు తీసుకురావడంలోజనసేనాని కష్టం వెలకట్టలేనిది… ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి… కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పరిపాలనను అబ్జర్వ్ చేస్తూ నెమ్మెదిగా అడుగులు
వేస్తున్నారు. గడిచిన ఆరు నెలలుగా ప్రభుత్వ పాలనలో బిజిబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
మార్చి నెల వస్తుందంటే జనసేన నేతలకు, పవన్ అభిమానులకు ఒక పండుగ… ప్రతీ ఏడాది మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్బావ సభను నిర్వహిస్తారు. ఆ వేదిక మీద నుంచి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై క్లారిటీ ఇస్తారు. అంతేకాదు ఇప్పటి వరకు ప్రతిపక్షభాగంలో ఉన్నపవన్ ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలను ఎత్తి చూపడంలో తనదైన శైలిని చూపించేవారు. కానీ ఈసారి జనసేన పాలకపక్షంలో ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీనికి తోడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్బావసభ కావడంతో పవన్ వ్యూహాలు, సభా నిర్వహాణపై భారీ అంచనాలు ఉంటాయి. జనసేనాని కూడా ఈ ఆవిర్బావ దినోత్సవాన్ని భిన్నంగా చేసెందుకు సిద్దమైయ్యారు.
రాజకీయంగా దేశంలో ఇంత వరకు ఏ పార్టీ సాధించని 100 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలుపు సాధించడంతో ఆ భాద్యత పవన్‌పై మరింత పడింది. అంతేకాదు రాజ్యంగ పరంగా, కేంద్ర ఎన్నికల సంఘ నిబంధల ప్రకారం కొన్నిపాటించాల్సిన అవసరం ఉండటంతో జనసేనాని ఈసారి ఆవిర్బావ సభను ఒక్కరోజు కాకుండా మూడు రోజులు పాటు ప్లీనరీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్లీనరీ సమావేశాలు కూడా తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో పెట్టాలని సూచించారు. అధినేత ఆదేశాలతో పార్టీ పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహార్ కోర్ కమిటీ భేటీ అయ్యింది… ఆ సమావేశంలో చర్చలతో పోగ్రామ్ కమిటీ గ్రౌండ్ లోకి వెళ్లింది.
జనసేన ఆవిర్బావ దినోత్సవం పురష్కరించుకుని ఈసారి ఆ పార్టీ మార్చి 12, 13, 14 తేదీలలో ప్లీనరీ సమావేశాలు పిఠాపురంలో నిర్వహించేందుకు రెఢీ అయ్యీయి. వీటి నిర్వహాణ కోసం గ్రౌండ్‌లు పరిశీలించేందుకు ఎమ్మెల్సీ హారిప్రసాద్ సారథ్యంలో ప్రోగామ్ కమిటీ పిఠాపురంలో పర్యటించింది. అనేక ప్రదేశాలు చూసినప్పుటికి చిత్రాడ ఎస్బి వెంచర్స్అనువైన స్ధలంగా జనసేన నేతలు భావించారు. సుమారు 140 ఎకరాల సువిశాలమైన స్ధలం కత్తిపూడి టు ఒంగోలు 214 నేషనల్ హైవేకు చేరుకుని ఉన్న ఈవెంచర్‌ను దాదాపు ఖరారు చేసారు. దీనికి తోడు చిత్రాడకు ఇరువైపులు పార్కింగ్ స్ధలాలను కూడా గుర్తించారు. జనసేన పార్టీ టెక్నికల్ టీమ్ కూడా ఆ స్ధలాన్ని పరిశీలించి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన తర్వాత మరోసారి కోర్ కమిటీ భేటీ అవుతోంది.
ఎస్బి వెంచర్స్‌పై సభా నిర్వహాణకు ఇతర అంశాలపై చర్చిస్తారు. ఐతే ఈ ప్రదేశం సువిశాలంగా ఉండటంతో
చివరి రోజు ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా నిర్వహించే భారీ బహిరంగసభకు కూడా అనువుగా ఉంటుందని భావించారు. అన్ని జిల్లాల నుంచి చిత్రాడ వచ్చేవారికి రోడ్డు మార్గం చాలా అనువుగా ఉంటుంది… రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు నుంచి 214 మీదుగా సభాస్ధలికి చేరుకోవచ్చు… ఉత్తరాంధ్రా నుంచి వచ్చేవారు కత్తిపూడి నుంచి చిత్రాడకు ఈజీ వే… ఇక గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలకు కూడా వేర్వేరు మార్గాల ద్వార అక్కడకి చేరుకోవడం పెద్ద కష్టం కాదు… ఇలా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత చిత్రాడ ఎస్బి వెంచర్స్ అనుకులమైనదని భావించినట్లు తెలుస్తోంది.
జనసేన నేతలకు ఆవిర్బావసభ పండుగ మొదలవుతోంది అనడంలో సందేహం లేదు… మరోవైపు డిప్యూటీ సీఎం కూడా 15 రోజులు పిఠాపురంలోనే మకాం వేస్తానని ప్రకటించడం ఆయా నేతలకు మరింత ఉత్సాహాన్నిస్తోంది.
రసినవారు: మురళీ మోహన్
ఏపీ బ్యూరో చీఫ్
అమరావతి