Tom Cruise: హాలీవుడ్ లెజెండ్ టామ్ క్రూజ్, అనా డి అర్మాస్ల రొమాంటిక్ జర్నీ సంచలనం సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా, ఈ జంట చేయి చేయి కలిపి షికార్లు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read: 71st National Film Awards: 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు!
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ల రొమాన్స్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 63 ఏళ్ల టామ్, 37 ఏళ్ల అనాల మధ్య 26 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, వీరి అన్యోన్యత అందరినీ ఆకట్టుకుంటోంది. వెర్మోంట్లో ఇటీవల కలిసి గడిపిన ఈ జంట, క్యాజువల్ లుక్‌లో చేయి చేయి కలిపి నడుస్తూ కెమెరాలకు చిక్కారు. టామ్.. మిషన్ ఇంపాజిబుల్, టాప్ గన్ వంటి సినిమాలతో లెజెండ్‌గా నిలిచాడు. అనా.. బ్లేడ్ రన్నర్, నైవ్స్ అవుట్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకుంది. వీరి డేటింగ్ వార్తలు బయటకు వచ్చినా, ఇద్దరూ దీనిని ధృవీకరించలేదు. గతంలో మూడు వివాహాలు చేసుకున్న టామ్, అనాతో ఈ కొత్త రొమాన్స్‌తో మళ్లీ చర్చల్లో నిలిచాడు. వీరి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

