Sreekanth Ayyar: జాతిపిత మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను గాయపరిచాయి. పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూద్దాం.
Also Read: RGV: ఆత్మగౌరవమే ‘శివ’ అసలైన వ్యక్తిత్వం
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యర్ మహాత్మా గాంధీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమయ్యాయి. యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్, సేవాలాల్ బంజారా సంఘం సభ్యులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శ్రీకాంత్ గాంధీని వ్యక్తిగతంగా దూషించి, నిరాధార ఆరోపణలు చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సమాజంలో ఉద్రిక్తతలు రేకెత్తాయి. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి, కేసు నమోదు చేశారు. గాంధీ లాంటి మహనీయులపై ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొడతాయని పోలీసులు హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మూర్తిని కలిసి, జాతిపిత మహాత్మా గాంధీజీపై సోషల్ మీడియాలో శ్రీకాంత్ చేసిన అనుచిత వాఖ్యలపై, చర్యలు తెవాకోవాలని బల్మూరి వెంకట్ కోరారు. ఈ వివాదం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో శ్రీకాంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. శ్రీకాంత్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడు, చట్టం ఏ విధంగా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.