Tollywood: వచ్చే ఏడాది దసరాకి టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే బాలకష్ణ, బోయపాటి ‘అఖండ2’తో పాటు రిషబ్ శెట్టి ‘కాంతారా చాప్టర్ 1’ రిలీజ్ ను కన్ ఫామ్ చేసుకున్నాయి. తాజాగా ఆ రేసులోకి సాయిధరమ్ తేజ్ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’ దూసుకు వచ్చింది. నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ తో అందరినీ ఆకట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా ను వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు.
Tollywood: దీంతో వచ్చే దసరాకి టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పటినుంచే హీటెక్కనుంది. బాలకృష్ణ, బోయపాటి నాల్గవ సారి కలసి చేస్తున్న సినిమా ‘అఖండ2’. ముందు మూడు చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయాలను సాధించటంతో ‘అఖండ తాండవం’తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టడం ఖాయమని అందరూ డిసైడ్ అయ్యారు. ఈమూవీని 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Rashmika Mandanna: ఆయుష్మాన్ ఖురానాతో హారర్ కామెడీలో రశ్మిక
Tollywood: ఈ రెండు కాకుండా ‘కాంతార’తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన రిషబ్ శెట్టితో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ తీస్తున్న ‘కాంతారా చాప్టర్1’ని కూడా దసరాకే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. చాలా టైమ్ ఉన్నందున దసరా రేసులో మరి కొన్ని సినిమాలు కూడా జాయిన్ కావచ్చు. మరి అంతిమంగా దసరా విన్నర్ గా నిలిచేది ఎవరో!?