Tollywood: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న నిర్మాతలు–ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదానికి తెరపడింది. ప్రభుత్వ జోక్యంతో ఈ సమస్యకు పరిష్కారం దొరకగా, రేపటి నుంచే సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నాయి.
లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు సర్దుబాటు చేసుకున్నారు. దీనితో పరిశ్రమలో నెలకొన్న ఉద్రిక్తత తగ్గి, కార్మికులు–నిర్మాతలు మధ్య సహకార వాతావరణం ఏర్పడింది.
సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సూచించినందుకు నిర్మాత దిల్‌రాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ పరిణామాలతో టాలీవుడ్ కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడనున్నాయని, పలు నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి వేగం అందుకోనున్నాయని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.