Nirmal: నిర్మల్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.మొన్నటివరకు ముదోల్ తాలూకా కుంటాల మండలంలోని సూర్యపూర్,మేదన్పూర్, అంబుగాం,పెంగళ్ పహాడ్ ఫారెస్ట్ ప్రాంతంలో సంచరించగా గ్రామస్తుల, కాపరుల కంటికి కనిపించింది.
నిర్మల్ – ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఘాట్స్ పై సంచరిస్తూ రోడ్డు దాటుతుందని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.అయితే అటుగా వాహనంలో వెళుతున్న యువకులు పెద్దపులి కనిపించడం తో తమ చరవాణిలో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారని తెలుస్తుంది.పెద్దపులి రోడ్డు దాటుతున్న కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతుంది.