Students Dead: ఉత్తర ప్రదేశ్ లో ధని-ఫరేండా హైవేపై మంగళవారం ఎస్‌యూవీ కారు టైరు పేలిపోవడంతో బోర్డు పరీక్షలకు హాజరవుతున్న ముగ్గురు విద్యార్థినులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బాధితులను చాద్ని పటేల్ (15), గాయత్రి గౌర్ (17) మరియు ప్రీతి (16)గా గుర్తించారు, వీరంతా మహరాజ్‌గంజ్‌లోని సమర్దీర, బిషున్‌పూర్ మరియు కర్మహా నివాసితులు. ధనిలోని మహేష్ రామ్ అశోక్ కుమార్ గర్ల్స్ ఇంటర్ కాలేజీ విద్యార్థులు బోర్డు పరీక్ష రాయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండగా, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. గాయపడిన విద్యార్థులందరినీ రక్షించి ధని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)కి తరలించారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందని ధనిలోని ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జి నవనీత్ నగర్ తెలిపారు. డ్రైవర్‌తో పాటు 14 మంది బాలికలు SUVలో ప్రయాణిస్తున్నారు.