Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి ప్రాణ హాని బెదిరింపులతో వార్తల్లోకి ఎక్కారు. వర్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో “సల్మాన్‌ను చంపేస్తాం, ఇంట్లోకి చొరబడి కాల్చేస్తాం, లేదా కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం” అంటూ స్పష్టంగా హెచ్చరికలు ఉన్నట్లు సమాచారం.
ఈ సందేశం గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సందేశాన్ని పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ బెదిరింపులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వైపు నుంచి వచ్చి ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మెసేజ్ పంపిన నంబర్‌ను ట్రేస్ చేసేందుకు సైబర్ టీమ్ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read: Jr NTR-Ram Charan: గొడ్డు చాకిరి!
Salman Khan: గతంలోనూ సల్మాన్ నివాసం వద్ద కాల్పులు జరగడం, ఫామ్‌హౌస్‌లో చొరబాట్ల ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పించింది. ప్రస్తుతం ఆయన షూటింగ్స్, పబ్లిక్ ఈవెంట్లకు కట్టుదిట్టమైన భద్రత నడుమ హాజరవుతున్నారు.

