Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు:
మెదక్, మెడికల్, మల్కాజిగిరి, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హనుమకొండ మరియు కరీంనగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరదలు వచ్చాయి. అలాగే, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు రైతులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తదుపరి సమాచారం కోసం వాతావరణ శాఖ వెబ్‌సైట్‌ను చూడాలని ప్రజలకు సూచించారు.