Shah Rukh Khan: పుష్ప, పుష్ప-2’ చిత్రాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. అలానే కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గత 2023లో ‘పఠాన్, జవాన్’ చిత్రాలతో మళ్లీ తన సత్తాను చాటాడు. అదే యేడాది డిసెంబర్ లో వచ్చిన ‘డంకీ’ చిత్రం కమర్షియల్ గా గ్రాండ్ విక్టరీని అందుకోకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇపుడు ఒకే స్రీాంన్ లో మెరియబోతున్నారు. ఇటు అల్లు అర్జున్, అటు షారుఖ్ ఇద్దరూ కూడా శీతలపానియం ధమ్స్ అప్ యాడ్ లో నటిస్తున్నారు. అయితే వీరిద్దరినీ కలిపి ఓ యాడ్ ను షూట్ చేస్తున్నారు. ఇది ఫిబ్రవరి ద్వితీయార్ధంలో లేదా మార్చి ప్రథమార్ధంలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. షారూక్ ‘కింగ్’ మూవీ షూటింగ్ కు ప్రిపేర్ అవుతుంటే… అల్లు అర్జున్… తనకు అచ్చి వచ్చిన త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నాడు.
