India vs England

India vs England: ఇంగ్లాండ్ పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీళ్లే

India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలోని జట్టును ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే ఇంగ్లాండ్‌పై భారత్ తరపున ఎవరు ఎక్కువ పరుగులు చేశారో చూద్దాం.

సవాలుతో కూడిన ఇంగ్లాండ్‌ పిచ్‌లపై పరుగులు సాధించడం ఏ బ్యాట్స్‌మన్‌కీ అంత సులభం కాదు, కానీ కొంతమంది భారత క్రికెటర్లు తమ అసాధారణ నైపుణ్యాలతో ఈ ఘనతను సాధించారు. ఇంగ్లాండ్‌పై టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారతీయ ఆటగాళ్లు ఎవరంటే

సచిన్ టెండూల్కర్ (2535 పరుగులు) : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌తో జరిగిన 32 టెస్ట్‌ల్లో 2535 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు మరియు 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 51.73.

సునీల్ గవాస్కర్ (2483 పరుగులు): భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ 38 టెస్ట్ మ్యాచ్‌ల్లో 2483 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 38.20.

ఇది కూడా చదవండి: Virat Kohli: మళ్లీ గ్రౌండ్ లో కోహ్లి కనిపించేది ఎప్పుడంటే?

రాహుల్ ద్రవిడ్ (1950 పరుగులు) ‘ది వాల్’ గా పిలువబడే రాహుల్ ద్రవిడ్ 21 టెస్ట్‌ల్లో 1950 పరుగులు చేశాడు. అతని సగటు 68.80, 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలున్నాయి.

విరాట్ కోహ్లీ (1727 పరుగులు) సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 28 టెస్ట్ మ్యాచ్ ల్లో 1727 పరుగులు చేశాడు. 4 సెంచరీలు. 6 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను 37.54

గుండప్ప విశ్వనాథ్ (1880 పరుగులు) కర్ణాటక క్రికెట్ లెజెండ్ గుండప్ప విశ్వనాథ్ 30 టెస్ట్ మ్యాచ్‌ల్లో 1880 పరుగులు చేశాడు. అతను 4 సెంచరీలు మరియు 12 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇందులో అతని సగటు 37.60.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Harshit Rana: సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చాడు.. చివరికి మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *