RS Praveenkumar: కుమ్రం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ పరిధి కోసిని గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇంటిలో చోరీ జరిగింది. చోరీ ఘటనను ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కుటుంబ సభ్యులు గురువారం గుర్తించారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లను దొంగలు దోచుకుపోయారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు.
RS Praveenkumar: తమ ఇంటిలో చోరీ వెనుక కుట్ర కోణం కూడా దాగి ఉన్నదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కుట్ర కోణాన్ని కూడా పరిశోధించాలని డీజీపీని కోరినట్టు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టారు.