Hyderabad: హైదరాబాద్ మహానగరంలో దీపావళి రోజైన గురువారం, ఆ తర్వాత రెండు రోజులపాటు బాణసంచా కాల్చే విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్ పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చడానికి అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని హెచ్చరిస్తూ నోటీస్ జారీ చేసింది.
Hyderabad: అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాలు, రోడ్లలో బాణసంచా కాల్చడం నిషేధమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో, నివాస ప్రాంతాల్లో బాణసంచా కాల్చి ఎవరికైనా హాని కలిగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.