Superman: సూపర్‌మ్యాన్ కొత్త రూపంలో డీసీ అభిమానులను అలరిస్తున్నాడు. జేమ్స్ గన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీబూట్ సినిమా కథ సూపర్‌మ్యాన్‌ను మానవీయ కోణంలో ఆవిష్కరిస్తుంది. క్లార్క్ కెంట్‌గా డేవిడ్ కొరెన్స్‌వెట్ నటన అద్భుతం. లెక్స్ లూథర్‌గా నికలస్ హోల్ట్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లొయిస్ లేన్‌గా రెచెల్ బ్రోస్నహన్ స్క్రీన్‌పై చక్కటి ఆకర్షణను తెచ్చింది. కథలో సూపర్‌మ్యాన్ ప్రపంచాన్ని రక్షించే సవాళ్లు, అతని వ్యక్తిగత జీవితంలోని ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంటాయి. పాకెట్ యూనివర్స్ సన్నివేశాలు, సూపర్ డాగ్ ఎపిసోడ్స్ యూత్‌ను ఉర్రూతలూగిస్తాయి.
Also Read: OG: OG థియేట్రికల్ బిజినెస్ సంచలనం!
క్లైమాక్స్‌లో ప్రజల మద్దతు సూపర్‌మ్యాన్‌కు భావోద్వేగ బలాన్ని ఇస్తుంది. సాంకేతికంగా ఈ చిత్రం అద్భుత విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా రూపొందాయి. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగినా, రెండో భాగంలో మలుపులు ఆసక్తి రేకెత్తిస్తాయి. కొన్ని లాజిక్ లోపాలున్నప్పటికీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అందరినీ ఆకర్షిస్తుంది. డీసీ అభిమానులకు ఇది ఓ గొప్ప సినిమాటిక్ అనుభవం.