Miraculous Astronomical Event: ఫిబ్రవరి 28న రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం అద్భుత సంఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆకాశంలో 7 గ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇలా ఏడు గ్రహాలు ఒకే లైనులోకి రావడం చాలా అరుదు. ఈ ఖగోళ అద్భుత సందర్భంగానే మహా కుంభమేళా జరుగుతుందని చెబుతారు. ఇప్పుడు మహా కుంభమేళా 2025 జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. కుంభమేళా ముగిసిన రెండు రోజులకు దీనికి సంబంధించి, ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ సంఘటన జరుగుతోంది.
ఫిబ్రవరి 28న, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు రాత్రిపూట ఆకాశంలో ఏడు గ్రహాల అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఇది శాస్త్రవేత్తలకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.
వీటిలో, ఆరు గ్రహాలు – శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ – ప్రస్తుతం రాత్రి ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి చివరలో కేవలం ఒక రాత్రికి మెర్క్యురీ వీటితో కలుస్తుంది.
ఇది కూడా చదవండి: Fraud Case: నుదుట సింధూరం పెట్టి పెళ్లి అయిందని బురిడీ.. యువతిని మోసగించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
దీని వలన మనం ఒకే రాత్రిలో సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలను చూడవచ్చు. వీటిలో ఐదు గ్రహాలను సాధారణంగా చూడవచ్చు. బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ సహాయంతో మాత్రమే యురేనస్,నెప్ట్యూన్ అనే రెండు గ్రహాలను చూడవచ్చు.
ఇటువంటి విశ్వ సంఘటనలు ఆధ్యాత్మిక శక్తులను పెంచుతాయని నమ్ముతారు. ఈ అరుదైన ఖగోళ సంఘటన గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఇలాంటిదే మరో అరుదైన సంఘటన 2025 ఆగస్టు మధ్యలో కనిపిస్తుందని చెప్పారు. అయితే, ఈ ఘటనలో ఆరు గ్రహాలూ మాత్రమే కనిపిస్తాయని వారు చెప్పారు. ఇప్పుడు మాత్రం 7 గ్రహాలు కనిపిస్తాయని వివరించారు.