Megastar: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన భారీ చిత్రం విశ్వంభరతో ఫుల్ జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఆ సినిమా రిలీజ్ కాకముందే చిరు మరో బిగ్ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. దర్శకుడు అనీల్ రావిపూడితో చిరంజీవి 157వ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా ఊహించని వేగంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు రెండో షెడ్యూల్‌కి సిద్ధమైంది.
ఈ సారి చిత్ర బృందం డెహ్రాడూన్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తోంది. మెగాస్టార్‌తో పాటు టీమ్ ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ షెడ్యూల్ హై వోల్టేజ్ సీన్స్‌తో రూపొందనుందని టాక్. అనీల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌ని రాకెట్ స్పీడ్‌లో తీసుకెళ్తున్నారు.
Also Read: Aadi Saikumar: ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లింగ్ ‘శంబాల’ టీజర్ రిలీజ్
Megastar: సంగీత దర్శకుడు భీమ్స్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, షైన్ స్క్రీన్స్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. చిరు ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్ కాబోతుందని అంటున్నారు!