The Old Guard 2: లాక్‌డౌన్ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన సూపర్ హీరో చిత్రం ‘ది ఓల్డ్ గార్డ్’. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ క్రేజీ సినిమాకి సీక్వెల్‌గా ‘ది ఓల్డ్ గార్డ్ 2’ ఎట్టకేలకు వచ్చేసింది. చార్లిజ్ థెరాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు జినా ప్రిన్స్ బైత్‌వుడ్ దర్శకత్వం వహించారు. ఈ రోజు జూలై 2, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సాలిడ్ యాక్షన్, సూపర్ హీరో జానర్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్. అన్నట్టు, ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. హై-ఓల్టేజ్ యాక్షన్ సీన్స్, గ్రిప్పింగ్ స్టోరీతో ఈ సీక్వెల్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
The Old Guard 2 is NOW PLAYING. pic.twitter.com/qGFrsigkNc
— Netflix (@netflix) July 2, 2025