Weather Update

Weather Update: ఈ ఏడాది చలి తక్కువగానే ఉండొచ్చంటున్న వాతావరణ శాఖ

Weather Update: ఈ ఏడాది శీతాకాలం వెచ్చగానే ఉంటుందట. చలిగాలులు పెద్దగా ఉండకపోవచ్చట. భారత వాతావరణ విభాగం – IMD ఈ మేరకు ఒక అంచనాను విడుదల చేసింది. భారతదేశంలో తేలికపాటి చలికాలంతో, చలిగాలుల రోజులు ఈసారి తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ఈ సీజన్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నవంబర్ నెల 1901 నుండి దేశంలో అత్యంత వేడిగా ఉన్న నెలగా రికార్డ్ అయింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం శీతాకాలానికి వచ్చిన ఈ రిపోర్టు చలిపులి విజృంభించే అవకాశం లేదని అంచనా వేస్తోంది.

.నవంబర్ 1901 నుండి దేశంలో రెండవ అత్యంత వేడి నెలగా ఉంది. నవంబర్ లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 29.37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సీజన్‌లో సాధారణం అయిన 28.75 డిగ్రీల కంటే 0.623 డిగ్రీలు ఎక్కువ. చలికాలంలో – డిసెంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.

ఇది కూడా చదవండి: WTC 2025: రసవత్తరంగా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్..ఫైనల్ బెర్తుల కోసం పోటీ పడుతున్న ఐదు జట్లు

Weather Update: ఈ సీజన్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని చాలా కొద్దీ ప్రాంతాలలో తప్ప మిగిలిన అన్ని చోట్లా గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *