Plastic Bottles: నేటి ఆధునిక జీవనశైలిలో ప్లాస్టిక్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. మన దైనందిన జీవితంలో, మనం అనేక రకాల ప్రయోజనాల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తాము. మంచినీళ్లు తాగేందుకు మనం రోజూ ప్లాస్టిక్ బాటిళ్లను వాడుతుంటాం.
మనం రోజూ తాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయని అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ బాటిళ్లలో ఉండే మైక్రోప్లాస్టిక్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
ప్లాస్టిక్ ఉత్పత్తులు పర్యావరణానికే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి వివిధ రకాలుగా ప్రవేశించి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అనేక అధ్యయనాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు . చాలా సూక్ష్మమైన ప్లాస్టిక్ ముక్కలు శరీరంలోని రక్తంలో కలిసిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Plastic Bottles: ప్లాస్టిక్ సీసాలు లేదా పాలిథిన్ కవర్ల తయారీకి పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇవి యాంటిమోనీ మరియు థాలేట్‌లను విడుదల చేస్తాయి. ఇలాంటప్పుడు ఇవి ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లలో కలిపి మన శరీరంలోకి చేరుతాయి.
ఇది కూడా చదవండి: SSMB 29: ప్రిన్స్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్ లోనే!
US నేషనల్ ఓషన్ సర్వీసెస్ ప్రకారం, మైక్రోప్లాస్టిక్స్ 5 మిమీ కంటే తక్కువ పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ కణాలు. అవి మన చుట్టూ కనిపిస్తాయి. ఇవి ఆహారం, గాలి, తాగునీరు వంటి వివిధ మార్గాల్లో మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి ఉపయోగించినప్పుడు లేదా సూర్యరశ్మికి గురైనప్పుడు, వాటిలోని ప్లాస్టిక్ క్షీణించి, చాలా చిన్న ప్లాస్టిక్ కణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఈ కణాలు చాలా చిన్నవి కాబట్టి, ఇవి సులభంగా శరీరంలోకి ప్రవేశించి గుండె జబ్బులకు కారణమవుతాయి.