KTR:రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం, క్రిమినల్ కేసులపై బుధవారం ప్రజాప్రతినధుల కోర్టులో విచారణ జరగనున్నది. ఫిర్యాదుదారు అయిన కేటీఆర్ తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. కేటీఆర్‌తోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోద్, దాసోజు శ్రవణ్‌కుమార్ వాగ్మూలాలను కోర్టు రికార్డు చేయనున్నది. మంత్రి కొండా సురేఖ కూడా కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులను జారీ చేసింది. దీంతో మంత్రి కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉన్నది.
