Thalapathy Vijay: తమిళనాడు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ద్విముఖ పోటీతో రక్తికట్టిన తమిళనాట రాజకీయాలు ఈ సారి త్రిముఖ, చతుర్ముఖ పోటీకి దారి తీసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే అధికారి డీఎంకే బలమైన పార్టీగా నిలదొక్కుకున్నది. అదే విధంగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉండనే ఉన్నది. ఈ సారి అధికారం కోసం ఆ పార్టీ తహతహలాడుతున్నది.
Thalapathy Vijay: ఈ నేపథ్యంలోనే కోట్లాది మంది అభిమానులు ఉన్న తమిళ అగ్ర నటుడు విజయ్ నూతన పార్టీని స్థాపించి గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో త్రిముఖ, లేదా చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం మెండుగా ఉన్నది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయ గోదాలోకి దూకారు. ఆయన తాజాగా ఆ పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
Thalapathy Vijay: విజయ్ చేసిన వ్యాఖ్యల్లో మూడు వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నానని చెప్పిన విజయ్.. 234 అసెంబ్లీ స్థానాల్లోనూ అన్నీ తన పేర్లనే చెప్పుకొచ్చారు. అంటే అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని, తనను చూసే జనం ఓటెయ్యాలని చెప్పకనే చెప్పినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Thalapathy Vijay: అదే విధంగా మరో కీలక వ్యాఖ్య ఆసక్తిని కలిగిస్తున్నది. కొందరు నటుల మాదిరిగా మార్కెట్ పోయాక తాను రాజకీయాల్లోకి రాలేదని, తాను అన్నింటికీ సిద్ధపడే సినిమాల్లోప్రాభవం ఉన్నప్పుడే తాను రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. తాను ఎంత చేసినా ప్రజల కృతజ్ఞతా రుణం తాను తీర్చుకోలేనని చెప్పుకొచ్చారు. నా పని ప్రజల కోసం పనిచేయడమేనంటూ ప్రజల సానుభూతి పొందే వ్యాఖ్యలు ఆసక్తిని కల్పించాయి.
Thalapathy Vijay: మరో కీలక వ్యాఖ్య కూడా రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించేలా ఉన్నది. ఈ సభలో విజయ్ మాట్లాడుతూ తమ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డీఎంకే పార్టీ రాజకీయ శత్రువుగా, బీజేపీని భావజాల శత్రువుగా తమ పార్టీ భావిస్తుందని స్పష్టంచేశారు. 1967లో డీఎంకే, 1977లో అన్నా డీఎంకేతో ఎలా మార్పు వచ్చిందో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల టీవీకే పార్టీతో అలాంటి మార్పే వస్తుందని చెప్పారు.