Texas Floods: అమెరికాలోని టెక్సాస్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. జలప్రళయంలో ఇప్పటి వరకు 24 మంది మృతిచెందారు. సుమారు 23 మంది బాలలు గల్లంతయ్యారని సమాచారం. అక్కడి రెస్క్యూ బృందాలు వరద సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఈ పెను విపత్తుతో సమీప ప్రాంతాల ప్రజలు అతలా కుతలం అవుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Texas Floods: అమెరికాలోని పలుచోట్ల గత కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కేవలం మూడు గంటల వ్యవధిలోనే 40 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో టెక్సాస్ రాష్ట్రం గుండా ప్రవహించే గ్వాడలూప్ నది ఉప్పొంగి ప్రవహించింది. నదీ తీర ప్రాంతంలో ఉండే ఓ క్రిస్టియన్ వేసవి శిబిరం శిబిరాన్ని వరదనీరు పూర్తిగా ముంచెత్తింది. దీంతో వరద ప్రవాహంలో క్రీడా శిక్షణకోసం వచ్చిన సుమారు 23 నుంచి 25 మంది బాలికలు గల్లంతైనట్టు సమాచారం. తమ పిల్లల ఆచూకీ దొరకక వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Texas Floods: గల్లంతైన వారి కోసం బోట్లు, హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వరదల కారణంగా 24 మంది చనిపోయినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. వేసవి శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన బాలికలు వరదలో గల్లంతయ్యారని, వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.