Venkatesh

Venkatesh: వెంకటేష్, త్రివిక్రమ్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్?

Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఘన విజయం సాధించారు. గత ఆరు నెలలుగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించకుండా జాగ్రత్తగా ఉన్న ఆయన తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కొత్త చిత్రం కోసం జతకట్టనున్నారు. ఈ చిత్రం హాస్యభరిత కుటుంబ కథాచిత్రంగా రూపొందనుంది. ఆగస్టు చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది, వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాకు ‘వెంకట రమణ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Also Read: Naga Chaitanya: హైదరాబాదులో జోరుగా నాగ చైతన్య కొత్త సినిమా షూటింగ్!

Venkatesh: ఈ టైటిల్‌పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. వెంకటేష్, త్రివిక్రమ్ గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాల్లో కలిసి పనిచేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సారథ్యం వహిస్తోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్ ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో ఓ నెల షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Daaku Maharaaj: ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే ‘డాకు మహారాజ్’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *