Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా.. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినంత కాలం ఎన్‌కౌంటర్లు కొనసాగుతూనే ఉంటాయన్నారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ఆయన ఇది ఇలాగే కొనసాగుతుందని అన్నారు. ఉగ్రవాదులు ఇక్కడికి వస్తున్నంత కాలం వారిని నిర్మూలిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Pawan kalyan: పాకిస్తాన్ హిందువులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్..
అఖ్నూర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫరూక్ అబ్దుల్లా ఈ విధంగా స్పందించారు. ఈసారి ‘దర్బార్ మూవ్’ ఉంటుందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ప్రతి శీతాకాలంలో జమ్మూ కాశ్మీర్ పరిపాలన – ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతం వేసవి రాజధాని శ్రీనగర్ నుండి జమ్మూకి మారుతుంది. దీనినే దర్బార్ మూవ్ అంటారు. శీతాకాలంలో ప్రభుత్వం అక్కడి నుండి పనిచేస్తుంది.