Ramcharan: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వెలుగు జిలుగులు దీపావళి రోజే మొదలుకానున్నాయి. చిచ్చుబుడ్లు, తారాజువ్వలు ఆకాశహర్మ్యాలను తాకనున్నాయి. సంక్రాంతి పర్వదినాన పండుగ చేసుకునేందుకు వేయికండ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ముందస్తు పండుగ దీపావళి వేదిక కానున్నది. అభిమానులను ఆనంద డోలికల్లో ముంచేందుకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సినిమా గేమ్‌చేంజర్ టీజర్ వేడుక ఇదే రోజు మధ్యాహ్నం వెలుగులు విరజిమ్మనుంది.
Ramcharan: టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న గేమ్‌చేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సిద్ధం చేసింది. ఈ మేరకు 12.06 గంటలకు ముహూర్తం నిర్ణయించింది. దీనినే ఎక్స్ వేదికగా Today 12:06 PM #GameChanger అని పేర్కొంటూ అభిమానుల్లో ఉత్కంఠను రేపుతున్నది.
Ramcharan: ఈ శుభవార్తతో మెగా అభిమానుల్లో ఆనంద సందోహం నెలకొన్నది. సినిమా 10-01-2025న సినిమా రిలీజ్ డేట్‌గా ఇప్పటికే నిర్మాణ సంస్థ నిర్ణయించింది. ఆ మేరకు అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొన్నది. ఇప్పుడు దీపావళి కానుకగా టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోతున్నది. నిజంగా మాకు ఈ రోజు పండుగే.. దీపావళిని మించిన పర్వదినం.. వెలుగులు విరజిమ్మే ఆనందం.. టపాసుల మోత మోగాల్సిందే.. అంటూ పలువురు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.