Terrorists killed: ఒకవైపు భారత్, పాకిస్తాన్ మధ్య దాడులు, ఎదురు దాడులు జరుగుతున్న వేళ సరిహద్దుల వెంబడి మనదేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులు భారత సైన్యం చేతిలో హతమయ్యారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని సాంబ జిల్లాలో సరిహద్దుల నుంచి ముష్కరుల రాకను గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) వారిని మట్టుబెట్టింది.
Terrorists killed: జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో చొరబాటుకు యత్నించి సైన్యం చేతిలో హతమైన ముష్కరులు జైషే మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అక్రమ చొరబాట్లకు అనువుగా పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, చిన్నపాటి మిసైళ్లతో దాడులకు పాల్పడింది.
Terrorists killed: ఇదే సమయంలో ఏడుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. ఆ విషయాన్ని అక్కడే ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి వెంటనే కాల్పులు జరిపి ఆ ముష్కరులను అంతమొందించారు. ఇదే విషయాన్ని బీఎస్ఎఫ్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది.