Tenali News: తెనాలి పట్టణంలోని యడ్ల లింగయ్య కాలినిలోని మురుగు కాలువలో స్థానికులు యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. కాలినీకి చెందిన కరీం బాషా మురుగు కాలవలో మృతిచెంది పడి ఉండటాన్ని తెల్లవారుజామున గుర్తించిన మహిళలు మృతదేహాన్ని వెలికి తీయించారు .
ఇది కూడా చదవండి: Robbery: నాతోనే గొడవ పెట్టుకుంటావా.. షాప్ లో 19 కిలోల వెండి చోరీ
చిన్నపాటి మురుగు కాలవలో యువకుడు పడి మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది . కాగా స్థానిక మహిళలు 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు .

