Telangana:

Telangana: తెలంగాణ‌లో ఆ ఉత్త‌ర్వులు ఈ రోజు నుంచే అమ‌లు.. రేప‌టి నుంచి మ‌రో ఉత్త‌ర్వులు పాస్‌

Telangana:రాష్ట్రంలోని దుకాణ‌దారుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ శుభ‌వార్త ఈ రోజు నుంచే అమ‌లు కానున్న‌ది. రంజాన్ ప‌విత్ర మాసాన్ని పుర‌స్క‌రించుకొని ఈ రోజు నుంచి (మార్చి 2) ఇదే నెల 31 వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ వెసులుబాటును క‌ల్పిస్తూ గ‌త నెల‌లోనే స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దుకాణాలు, వ్యాపార స‌ముదాయాల‌ను 24 గంట‌లు ఓపెన్ చేసుకునేందుకు అవ‌కాశం ఇస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సంజ‌య్‌కుమార్ ఉత్త‌ర్వులు ఇచ్చారు.

Telangana:రాష్ట్ర‌ప్ర‌భుత్వం జారీచేసిన జీవోలో కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. చ‌ట్టంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం రోజుకు 8 గంట‌లు, లేదా వారానికి 48 గంట‌ల‌కు మించిన ప‌నిచేసిన ఉద్యోగులు, కార్మికుల‌కు సాధార‌ణ వేతనం క‌న్నా రెండింత‌లు చెల్లించాలి.. అని పేర్కొన్నారు. జీవో నంబ‌ర్ 476కు లోబ‌డి సెల‌వుల్లో ప‌నిచేసిన కార్మికుల‌కు ప్ర‌త్యామ్నాయ సెల‌వు ఇవ్వాల‌ని, మ‌హిళా ఉద్యోగుల‌కు రాత్రి వేళ‌ల్లో ప‌నిచేసేందుకు అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు.

Telangana:మ‌రోవైపు రంజాన్ మాసం సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క అవ‌కాశం ఇచ్చింది. మార్చి 3 నుంచి ఇదే నెల 31 వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేసే ముస్లిం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌, బోర్డులు, కార్పొరేష‌న్‌, ప‌బ్లిక్ సెక్టార్ ఉద్యోగులు సాయంత్రం 4 గంట‌ల‌కే ఆఫీసుల నుంచి, స్కూళ్ల నుంచి వెళ్లిపోవ‌చ్చ‌ని అవ‌కాశం క‌ల్పించింది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *