Telangana: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మూడు నెలల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఆయన తాజాగా కూడా స్పందించారు.
Telangana: అత్యున్నత ధర్మాసనం ఆదేశాల మేరకు 2025 అక్టోబర్ 31లోగా సరైన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తాజాగా ప్రకటించారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు పంపించామని స్పీకర్ తెలిపారు. వారు కొంత గడువు కోరారని తెలిపారు. స్పీకర్ చర్యలు ఎలా ఉంటాయోనన్న అంశంపై రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉంత్కంఠగా నెలకొన్నది.