Telangana Rising Global Summit: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో హాజరుకానున్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో తెలంగాణ సర్కారు సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతోపాటు రానున్న విజన్- 2047 పేరిట ప్రణాళికను విడుదల చేయనున్నారు.
Telangana Rising Global Summit: ఇదే గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా తెలంగాణ సర్కారు ప్రజాపాలన ఉత్సవాలను కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు డిసెంబర్ 10 నుంచి 12 వరకు ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజన్ డాక్యమెంట్ రూపకల్పనకు బాధ్యతలను సర్కారు అప్పగించింది. ఈ డాక్యమెంట్‌లో భావి తెలంగాణ ఎలా ఉండబోతుందో తెలిపే అంశాలు ఉండనున్నాయి.
Telangana Rising Global Summit: ఈ సదస్సులోనే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఒక్కో శాఖ సాధించిన విజయాలు, ప్రగతిని వివరించనున్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే వివిధ అంశాలను వెల్లడి చేయనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ముందడుగు వేయనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది.
Telangana Rising Global Summit: ఈ మేరకు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం హైదరాబాద్ నగర పరిధిలోని వివిధ హోటళ్లలో సుమారు 500కు పైగా గదులను తెలంగాణ సర్కారు బుక్ చేసినట్టు తెలిసింది. అతిధుల కోసం ప్రత్యేక వంటకాలను రుచి చూపనున్నట్టు సమాచారం. సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేస్తున్నది. ఒకేసారి సుమారు 4,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

