TG Govt: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సేవలందిస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, వారికి గత మూడు నెలలకు సంబంధించిన జీతాలను విడుదల చేసింది. ఆర్థిక శాఖ ఈ మేరకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు కలిపి మొత్తం రూ. 150 కోట్లను మంజూరు చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈ నిధులు మంగళవారం (జూలై 8) గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 53 వేల మంది మల్టీపర్పస్ వర్కర్లకు ఒకటి లేదా రెండు రోజుల్లో వారి వేతనాలు నేరుగా అందనున్నాయి. ఈ నిర్ణయంతో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న వర్కర్లకు పెద్ద ఊరట లభించినట్లైంది.
Also Read: Addanki dayakar: కేటీఆర్ ఓ బచ్చా
గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛత, పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి కీలక సేవలను అందిస్తారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. తరచుగా వేతనాల ఆలస్యం ఎదుర్కొంటున్న వీరికి, మూడు నెలల జీతాలు ఒకేసారి విడుదల కావడంతో ఆర్థికంగా చేయూత లభించినట్లయింది. ప్రభుత్వ తాజా చర్య పట్ల మల్టీపర్పస్ వర్కర్లు, వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.