Telangana

Telangana: రూ.కోటికి పైగా విలువ చేసే డ్ర‌గ్స్ ప‌ట్టివేత

Telangana: కొందరు మారరు. కేసులు పెడతాము ..జైలుకు పంపుతాము అని బెదిరించిన మేము ఇంతే అని కొందరు ఉంటారు. అలా ఉండే కొందరు ఇప్పుడు మళ్లీ దొరికిపోయారు. సమాజ సేవ అన్నట్లు …అదే పనిగా ఈ పని చేస్తూ ..లక్షలు ఐతే సంపాదించారు కానీ…కమింగ్ డేస్ లో కాలం మొత్తం కటకటాల్లోనే అని తెలియక కక్కుర్తి పడ్డారు. సో కాలం ఈ కంట్రీలను జైలులోపలికి పంపింది. 

హైద‌రాబాద్ – రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ పోలీసులు భారీ డ్ర‌గ్స్ రాకెట్ ను చేధించారు..  కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల మాదకద్రవ్యాలను  పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ నగరానికి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర రాకెట్‌‌ను మీర్‌పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ జోన్ ఎస్ వో టి పోలీసులు ఛేదించారు.

నిందితుల నుంచి కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అంతర్రాష్ట్ర ముఠాకు ముగ్గురిని అరెస్టు చేశారు. గసగసాల , ఎఫ్ ఎం వంటి మాదక ద్రవ్యాలను మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Palnadu: స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు మృతి..

Telangana: హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ బూతం వీడటం లేదు. ఇప్పటి వరకు జిల్లాలు, రాష్ట్రాల నుంచి సరఫరా అయిన డ్రగ్స్‌ ఇప్పుడు ఏకంగా దేశాలను దాటించి మరీ హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఎల్బీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. 

డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం, పోలీసులు చెప్పినప్పటికీ ఏదో విధంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తునే ఉన్నారు ముఠా సభ్యులు. ఇటీవల దాదాపు రూ.25 లక్షలు విలువల చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడ్లర్‌తో పాటు అంతర్రాష్ట్ర ఫెడ్లర్‌ను కూడా ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. అయితే తరచూ ఇలా డ్రగ్స్‌ పట్టుబడుతుండటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *