Telangana Politics: ఉగాది పర్వదినాన తెలంగాణ మంత్రిమండలి విస్తరణ ఉంటుందని ఇటీవలే అంతా ప్రచారం జరిగింది. మంత్రులు కూడా ఫిక్స్ అయ్యారు. ఈలోగా మరో వార్త హల్‌చల్ చేస్తున్నది. అదేమిటంటే మంత్రివర్గంలో మార్పులు మేలో జరుగుతాయని ప్రచారం జరుగుతున్నది. ఉగాదికి అటూ ఇటుగా మంత్రివర్గ విస్తరణ ఉండగా, మేలో మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Telangana Politics: దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను మారుస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వస్తున్నది. అక్కినేని ఫ్యామిలీపై, మాజీ మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యల ఫలితంగా ఆమెపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమెను తొలగిస్తారని తెలుస్తున్నది. ఆమె స్థానంలో ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైనా సినీ నటి విజయశాంతిని మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నదన్న వార్త ఈ రోజు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
Telangana Politics: తొలుత మంత్రివర్గ విస్తరణలో నలుగురిని తీసుకుంటారని తెలుస్తున్నది. ఉగాది సందర్భంగా నలుగురితోనే సరిపెడతారని, మరో రెండు పోస్టులను ఖాళీగా ఉంచుతారని తెలుస్తున్నది. ఈ దశలో కొండా సురేఖతోపాటు మరో దక్షిణాది మంత్రికి కూడా ఉద్వాసన ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఆయన స్థానంలో మరో ఓసీ ఎమ్మెల్యేకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతుంది.

