Telangana News: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన వారిపై తెలంగాణ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకున్నది. అక్రమాలకు పాల్పడిన ఆ ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేసింది. దీంతో ఆయా ఆసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు కూడా ఉండవన్నమాట. ఇప్పటికే పలు ఆసుపత్రులు ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నా, పకడ్బందీగా ఆయా ఆసుపత్రులను పట్టుకోగలిగారు.
Telangana News: క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010 కింద అవకతవకలకు పాల్పడిన ఆ 28 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలులోకి తేవాలని ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఆ ఆసుపత్రులు ఉన్నాయి.
Telangana News: అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే 10 ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో 6, హైదరాబాద్ 4, నల్లగొండ 3, మహబూబాబాద్ 2, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేశారు.
Telangana News: రోగులకు వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో సీఎం సహాయ నిధి బిల్లులను కొల్లగొట్టినట్టు ఆ ఆసుపత్రులపై ఆరోపణలు వచ్చాయి. విచారణలో లోతైన దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. సీఐడీ విచారణకు సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రైవేటు యాజమాన్యాల పాత్ర ఉన్నట్టు తేలడంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రులను ఆనాడే వైద్యారోగ్యశాఖ బ్లాక్‌లిస్టులో పెట్టింది. నేడు ఏకంగా రిజిస్ట్రేషన్లనే రద్దు చేసింది.